ఆక్లాండ్: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. మార్టిన్ గప్టిల్ 30 పరుగులు చేయగా, కోలిన్ మన్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54) అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరి దెబ్బకు పరుగులు తీసిన కివీస్ స్కోరు బోర్డు 203 పరుగుల వద్ద ఆగింది. జనీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, శివం దూబే, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. అనంతరం 204 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లోకేశ్ రాహుల్ 56 పరుగులు చేసి మరోసారి సత్తా చాటగా, శ్రేయాస్ అయ్యర్ (58) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ కోహ్లి 45 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 7, శివం దూబే 13, మనీష్ పాండే 14 పరుగులు చేశారు. సౌథీ వేసిన 49వ ఓవర్ చివరి బంతిని సిక్సర్‌గా మలిచిన శ్రేయాస్ అయ్యర్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. 5 మ్యాచ్ టీ20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ 26న ఇదే మైదానంలో జరగనుంది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధీ రెండు వికెట్లు పడగొట్టగా, బ్లెయిర్ టిక్సెర్, మిచెల్ శాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు. అద్భుత ఇన్నింగ్స్బ్స్ జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయాస్ అయ్యరకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
6 వికెట తేడాతో ఘన విజయం