సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

సంక్రాంతి... రెండు వారాలు ముందుగానే.. పల్లెల్లో పండుగ మొదలవుతుంది. ఉదయం, సాయంత్రం.. ఇంటిముందు కళ్లాపి చల్లి... అందమైన ముగ్గులు వేస్తారు. ఆవుపేడతో గొబ్బెమ్మలు చేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. సంక్రాంతి రోజున పగలు, రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. ఈ రోజు సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతి అంటారు. ఇప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ రోజున ఇంటికొచ్చే బసవన్నలకు, హరిదాసులకు తోచినంత సహాయం చేయండి. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నానమ్మ చేసిన నువ్వుల లడ్డూలను వంచి పెట్టండి. ఇది కైట్స్ ఫెస్టివల్. కాబట్టి గాలి పటాలు ఎగరేయండి. గాలి పటాలు ఎగరేయడం వెనక మరో ఉంది. ఆరుబయట గాలిపటాలు ఎగరేస్తారు కదా! ఈ సమయంలో సూర్యరశ్మి తగినంత పడుతుంది. డి-విటమిన్ తగినంత లభిస్తుంది. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం సొంతమవుతుంది. చర్మ వ్యాధులు దరిచేరకుండా ఉ సంక్రాంతి అంటే ఓ సరదా.. సంబరం.. ఆత్మీయుల మధ్య చేసుకునే అందమైన వేడుక. ఏడాదిలో వచ్చే తాలిపండుగ. మూడు రోజుల ముచ్చటైన సంతోషం. అరిసెలు, గారెలు.. 'రూరించే పిండివంటలు. పిల్లలు.. పెద్దలు.. కుటుంబ సభ్యుల సంతోష తీరం. చిన్నారులకు భోగిపళ్లు.. యువతకు సరదా పందేలు. సొంతూళ్లలో బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు పల్లెబాట పట్టారు. కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. రెండు మూడు రోజులుగా ప్రతి ముంగిటా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ముంగిళ్లలో తీర్చిదిద్దిన రంగవల్లికలు.. ముచ్చటగా కనిపించే గొబ్బెమ్మలతో ముందుగానే సంక్రాంతి వచ్చిందా అనిపించింది. ఇన్ ఫెక్షన్లపై పోరాటానికి కావాల్సిన శక్తిని పొందటానికి ఇది దోహదపడుతుంది. నువ్వుల లడ్డులు తినాలని చెప్పడం వెనక కూడా సైన్స్ ఉంది. ఇది చలికాలం. నువ్వులు తినడం వల్ల శరీరం లో వేడి పెరుగుతుంది. అందుకే నువ్వుల లడ్డూలు తప్పక తింటారు.


ఇక్కడ మాదిరిగానే మహారాష్ట్రలో మూడు రోజుల పాటు పండుగ జరుపుకొంటారు. నువ్వుల లడూలు పంచుతారు. తమిళనాడులో నాలుగు రోజులపాటు సంబరాలు జరుపుకుంటారు. సంక్రాంతిని 'పొంగల్' అని పిలుస్తారు. అసోంలో భాగాలి బిహు అని పిలుస్తారు.


గుజరాత్ లో ఉత్తరాయణ్ గా పండుగను జరుపుకుంటారు. గాలి పటాలు ఎగరవేసే పోటీలు నిర్వహిస్తారు.


ఉత్తరప్రదేశ్ లో కిచెరి పేరుతో జరుపుకునే పండుగ ఆకట్టుకుంటుంది. ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి నువ్వుల లడ్డూలు తింటారు. కర్ణాటకలో పిల్లలందరూ కొత్త బట్టలు ధరిస్తారు. బాలికలు ఇతర కుటుంబ సభ్యుల బాలికల ఇళ్లకు వెళ్లి ప్లేట్లు మార్పిడి చేసుకుంటారు. ఈ సంప్రదాయానికి 'ఎల్లు బిరోదు' అని పేరు. ఎల్లు అంటే నువ్వులు. పళ్లెంలో నువ్వులు, బెల్లం, వేరుశెనగలు, ఎండుకొబ్బరి పెట్టి ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ మిశ్రమాన్ని 'ఎల్లు బెల్ల' అంటారు. సంక్రాంతికి కవులు పదాలను పతంగులుగా చేసి ఎగురవేస్తారు. పద్యాలను ఇళ్ల ముందరి ముగ్గుల వలే అందంగా తీర్చిదిద్దుతారు. పాటలను బాణీ కట్టి ఆడపిల్లల కిలకిలలకు జోడు కడతారు. కవులు సంక్రాంతి వస్తే పాతభావాలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయమంటారు. కొత్త చైతన్యాన్ని గడపలకు తోరణాలుగా కట్టమంటారు. కళలు వెల్లివిరిసే సమాజమే సంతోషకరమైన సమాజం. కవులు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. సమాజం కవుల వాక్కుకు చప్పట్లు అర్పించాలి. అభ్యుదయమే అసలైన క్రాంతి. పురోగమించడమే అసలైన సంక్రాంతి. మంచు పరచిన దారి మళ్లి వెలుగు వెచ్చని బాటలోకి అడుగుపెట్టే రవికిరణమా సంక్రాంతి ఆభరణమా స్వాగతం హరివిల్లు రంగుల ముగ్గులన్నీ పరచి వాకిట తేనెలొలికే పలుకు తీయని స్వాగతం పాడిపంటలు పచ్చదనమై ఆడిపాడే పల్లె వెలుగై నిదుర మబ్బులు మేలుకొలిపే పల్లె సీమల పాట స్వరమై భోగి వెలుగుల జిలుగు మంటలపాతనంతా ఆహుతంటూ పలుకు తీయని స్వాగతం పిల్లపాపలనెల్లకాలం పదిలమంటూపసిడి పంటల పరిమళాలను జల్లుజల్లుగ భోగిరోజున పళ్ళు పూలై తలతడిమి జారే దీవెనలుగా ఆశీస్సులన్నీ అడుగు అడుగున వెన్నంటి నిలిచే చిలక పలుకుల స్వాగతం.రాతిరంతా వెలుగు మడుగై వేలికొసలన రంగు రూపై కొత్త చిత్రపు ముగ్గు మధ్యన పూలరెక్కల పాన్పుపై గౌరీ దేవిగపూజలందే ప్రాణదాతకు ప్రకృతికి గొంతువిప్పిన గొబ్బిపాటల స్వాగతం పాతకొత్తల మేలుకలయిక గంగిరెద్దుల నాట్య హేలకు సన్నాయి రాగం డోలు శబ్దం నింగికెగసే గాలి పటమైహరిలోరంగహరీ అక్షయపాత్రన వెలిగే దక్షత నింగే నేలై తెలిపే స్వాగతం