ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మలకు ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వీరిరువురిని తక్షణం తొలగించాలని ఎన్నికల సంఘం బుధవారంనాడు ఆదేశించింది. దేశద్రోహులను కాల్చిచంపండి” అంటూ ఈ నెల 27న రితాలలో జరిగిన బహిరంగ సభలో పలుమార్లు ఠాకూర్ నినాదాలిచ్చినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక నివేదకలో ఈవీఐకి తెలిపారు. ఠాకూరకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు ఇస్తూ, ఈనెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ సైతం ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'లక్షలాది మంది ప్రజలు అక్కడ (షహీన్ బాగ్)లో గుమిగూడారు. వాళ్లు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు, నా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారాలు, హత్యలు చేయవచ్చు. ఇవాళ మీకు సమయం ఉంది. రేపు మోదీ కానీ, అమిత్ షా కానీ , మిమ్మల్ని కాపాడలేకపోవచ్చు. ఇప్పుడే ప్రజలు మేల్కోవాలి' అని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వర్మ, ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
బీజేపీ మర్యాదగా మాట్లాడడం మానేసింది.
బీజేపీ మర్యాదగా మాట్లాడడం మానేసింది. న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇవాళ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో “దారుణ పరాజయం ” తప్పదన్న భయంతోనే వారంతా మర్యాదగా మాట్లాడడం మానేశారంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్, పశ్చిమ ఢిల్లీ బీజేపీ నేత పర్వేజ్ వర్మ, బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వాడుతున్న భాష దారుణంగా ఉందని చిదంబరం అన్నారు. వారి వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. “మంత్రి అనురాగ్ ఠాగూర్, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, బీజేపీ బెంగాల్ ప్రశ్నించారు. “మంత్రి అనురాగ్ ఠాగూర్, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, బీజేపీ కర్నాటక మంత్రి నీటీ రవి తదితరులు మాట్లాడుతున్న భాష రులు మాటాడుతును బావ భయంకరం. ప్రధాని, బీజేపీ చీఫ్ ఈ నేతల భాషపై ఎందుకు స్పందించడం లేదు?” అని కానీ , చిదంబరం ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నెల రోజులుగా కొనసాగుతున్న షహీన్బాగ్ నిరసనలపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.