రద్దు అంత ఈజీకాదు

మండలి రద్దు, పునరుద్ధరణ అంత ఈజీ కాదు. ఇపుడు ఎపిలో మండలి రద్దుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. 'పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా! అని ప్రభుత్వం వారు  ప్రశ్నిస్తున్నారు. మండలి రద్దుకు జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎలా అయినా మండలిని | రద్దుచేయాలని ఆయన యోచన. రద్దుకోసం  శాసన సభలో తీర్మానం సులువే కాని కేంద్రం సహకారం ఉంటేనే అది సాధ్యమౌతుంది. 1985 మూతపడిన మండలిని.... మధ్యలో మర్రి చెన్నారెడ్డి తెరిపించలేకపోయారు. అతి  కష్టంమీద 2007లో వైఎస్ అనుకున్నది సాధించారు. మండలి రద్దు, పునరుద్ధరణపై గతంలో ఏం జరిగిందో చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. మండలిని రద్దు చేయాలని రాజ్యంగంలోని169వ నిబంధన ప్రకారం శాసన సభలో అధికారపక్షం సులువుగా తీర్మానం చేయవచ్చు. ఆ తర్వాత దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. దీనిపై కేంద్రం స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత... రాష్ట్రపతి సంతకం చేస్తే మండలి రద్దు నిర్ణయం అమలులోకి వస్తుంది. వెరసి... కేంద్రం ఎంత వేగంగా, ఎంత బాగా సహకరిస్తుందన్న దానిపైనే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష ఫలిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష ఫలిస్తుంది. ఈ ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు శాసనసభలో ఆధిక్యం ఉన్నప్పటికీ... మండలిలో మాత్రం కాంగ్రెసదే పైచేయి. ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్న మండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ భావించి 1984లో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అప్పట్లో ప్రధానిగా ఇందిరాగాంధీ దీనిని పక్కన  పెట్టేశారు. ఇందిర హత్యానంతరం రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆయన ఎన్టీఆర్ తో సఖ్యత కోరుకున్నారు. పైగా... రాష్ట్ర ప్రభుత్వమే వద్దనుకున్నాక కేంద్రం అడ్డుకోవడం ఎందుకని భావించారు. 1985 మేలో 3 రోజుల వ్యవధిలో మండలి రద్దుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి సంతకం కూడా పూర్తయింది. 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శాసన మండలిని పునరుద్ధరించాలని భావించారు. 1990లో శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా అప్పుడు వున్న కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వాలు లోక్సభలో ఈ బిల్లు మురిగిపోయింది. వెరసి... మండలి పునరుద్ధరణకు చెన్నారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించనేలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. మండలి పునరుద్ధరణ అంశం మూలన పడింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మండలిని పునరుద్ధరించాలంటూ 2004 చివర్లో శాసనసభలో తీర్మానం చేశారు. కాంగ్రెస్ లో అప్పుడు వైఎస్ తిరుగులేని నాయకుడు. అయినప్పటికీ... సులువుగా ఆమోద ముద్ర వేయించుకోలేకపోయారు. దీనికోసం భారీగా లాబీయింగ్ అవసరమైంది. మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజుకు వైఎస్ ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ తో ఉన్న సంబంధాలతో కంతేటి ప్రయత్నాలు ముమ్మరం  చేశారు. ఢిల్లీకి షటిల్ సర్వీసు చేశారు. దీంతో... ఆయన పేరు 'కౌన్సిల్ రాజు'గా మారిపోయింది. పాటిల్ ఒత్తిడితో బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. వైఎస్ అనుకున్న మూడేళ్లకు 2007లో మండలి మళ్లీ మొదలైంది. అపుడు  తెరుచుకున్న మండలి తలుపులను... మళ్లీ మూయించేం దుకు ఆయన తనయుడు జగన్ ప్రయత్నిస్తున్నారు.మండలి రద్దుకు మేం ఒప్పుకోం' అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. జగన్ ఎలాగైనా మోదీ, అమిత్ షాలను ఒప్పించి లోక్సభలో ఆమోదం పొందినా... రాజ్యసభలో మాత్రం చుక్కెదురు కావచ్చు.