సెడాన్ పార్క్: న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ సిరీస్ భారత్ సొంతమైంది. ఇంకా రెండు మ్యాచు ఉండగానే సిరీసన్ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో కోహ్లి సేనను విజయం వరించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్ లో భారత జట్టు విజేతగా నిలిచింది.సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ తరఫున కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్ బ్యాటింగ్ కు దిగారు. వీరిద్దరూ కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేశారు. దీంతో 18 పరుగుల లక్ష్యంతో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. తొలి రెండు బంతుల్లో మూడు పరుగులే రావడంతో భారత్ విజయంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తర్వాతి బంతికే రాహుల్ ఫోర్ కొట్టాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ తీయడంతో రోహిత్ స్టయికింగ్ కు వచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండు బంతులనూ సిక్సర్లుగా మలిచిన రోహిత్ జట్టుకు విజయాన్నందించాడు. దీంతో 5 మ్యాచుల టీ20 సిరీసన్ను భారత్ 3-0తో మరో రెండు మ్యాచులు మిగిలుండగానే కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ తో తొలి రెండు టీ20ల్లో విఫలమైన ఓపెనర్ రోహిత్ శర్మ(65: 40 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లు) మూడో టీ20లో పరుగుల వరద పారించాడు సెడాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మ న్లో రోహిత్(65), కోహ్లి (38), రాహుల్(27) పరుగులు చేయగా.. అయ్యర్(17), మనీష్ పాండే(14) పర్వాలేదనిపించారు. శివందూబే(3) మాత్రమే నిరాశపరిచాడు. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవరకు వెళ్లారు. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.
సిరీస్ సొంతం..