నిరాశాజనకం....

కేంద్ర బడ్జెట్ సమాజంలోని అన్ని వార్తల వారిని నిరుత్సాహపరిచింది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉన్నా ఆ సంగతిని పూర్తిగా విస్మరించింది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఉన్నత విద్యలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారు. ఉన్నత విద్యా సంస్థల్లో డిగ్రీ, డిప్లొమా కోర్సులకు అప్రెంటిస్ షిప్ ప్రతిపాదించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏడాదిపాటు స్థానిక సంస్థల్లో పని ఇస్తారు. వీళ్లకు ఉపాధి కల్పించలేకపోతే సమాజంలో అశాంతి తప్పదు. నిర్మాణ, నిర్వహణ, మౌలిక సౌకర్యాల కల్పనా రంగంలో కోటి కోట్లు పెడతామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది లక్ష కోట్లకు పైనే వెచ్చిస్తానని చెబుతున్నా పెట్టుబడుల ఉపసంహరణ డబ్బులు వస్తేనే అది సాధ్యమౌతుంది. 2030 నాటికి అతి పెద్ద వర్కింగ్ ఏజ్ జనాభా భారత్ లోనే ఉండబోతోంది. వీరందరికీ ఉపాధి సవాలేమహిళ వివాహ వయసును పురుషులతో సమానంగా పెంచే విషయమై ప్రభుత్వం యోచిస్తోంది. టాస్క్ ఫోర్స్ ను వేస్తోంది. మహిళాభ్యున్నతి పథకాలకు 14 శాతం అధికంగా రూ 28,600 కోట్లు కేటాయించారు. బాలికల నుంచి మహిళ దాకా వివిధ వయస్సుల వారి సంక్షేమం కోసం నిధులు పెంచారు.ఆదాయపు పన్నుపై పాత విధానమా లేక కొత్త విధానమా అన్నది తానే తేల్చుకోవాలి. పాత విధానాన్ని కొనసాగిందల్చుకుంటే అనేక రకాల మినహాయింపులు కొనసాగుతాయి. కొత్త విధానమైతే అవేవీ ఉండవు. ఏడు రకాల పన్ను శ్లాబులు ప్రకటించారు. 5లక్షల లోపు ఆదాయం  ఉన్నవారికి పన్ను ఉండదు. 5-7.5 లక్షలైతే 10 శాతం, 7.5-10 లక్షలైతే 15 శాతం వ్యవసాయ రుణాలు 15 లక్షల కోట్లకు(1 1 శాతం) పెంచుతామన్నారు. కృషి ఉడాన్, కృషి రైల్ పేరిట రైలు, విమాన మార్గాల ద్వారా ఉత్పత్తుల రవాణాకు అవకాశం కల్పిస్తామన్నారు. ఉద్యాన పంటల ఎగుమతి, మార్కెటింగ్ పెంచడానికి వన్ ప్రొడ్యూస్ వన్ డిస్ట్రిక్ట్ పథకాన్ని ప్రకటించారు. వ్యవసాయంలోని వివిధ విభాగాలకు నామమాత్రపు కేటాయింపులే చేశారు.వ్యాపారులను దొంగల్లాచూసి పెద్దనోట్లు రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వారి విలువ తెలుసుకుంటోంది. యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి లైసెన్సుల జారీకి ఇన్వెస్ట్మెంట్ సెల్ ఏర్పాటు చేస్తోంది. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే స్టార్టప్ లకు ఊతమిస్తోంది. మాంద్యంలో వ్యాపారులకు అండగా నిలవడమే ఇప్పుడు కీలకం.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి భారీగా రూ.2.83 లక్షల కోట్లను ఇచ్చింది. వ్యవసాయంలో సోలార్‌కు ప్రాధాన్యం పెంచింది. కొత్తగా నాలుగు పథకాలను ప్రకటించింది వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 15 లక్షల కోట్లకు పెంచింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1 1 శాతం పెరిగింది. ఫసల్ బీమా యోచన కింద | 16.11 కోట్ల మంది రైతులకు బీమా కల్పించినట్లు వెల్లడించింది. బీడు భూములు ఉన్న రైతులు వాటిలో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను పెట్టుకుని విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్ కు అమ్ముకోవచ్చు. . ప్రైవేటు భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 150 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. గత ఏడాది ఓటాన్, పూర్తిస్థాయి బడ్జెట్లలో రైల్వేలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం )ని ప్రోత్సహిస్తామని ప్రకటించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఈ సారి బడ్జెట్ లో 150 రైళ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో నడుపుతామని తెలిపారు. తాజా  బడ్జెట్ లో రైల్వేకు రూ. 70వేల కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా విషయంలో, నిధుల కేటాయింపులో మోదీ సర్కారు మోసానికి, దగాకు పాల్పడిందని ఆరోపించారు. గత ఏడాది బడ్జెట్లో ఇస్తామని చెప్పిన నిధుల్లో కోత విధించడమే కాకుండా.. తాజా బడ్జెట్లో అన్ని రంగాలకు నిధులుకుదించారని విమర్శించారు.