పాదచారుల పాట్లు..

హైదరాబాద్ సిటీలో రోడ్డు దాటాలంటే వాహనదారులే అనేక అవస్తలు పడుతుంటారు. ఇక పాదచారుల సంగతి చెప్పక్కర్లేదు. నగరంలో ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ రద్దీగా దర్శనమిస్తోంది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రం వంతెలను నిర్మించినప్పటికీ.. ఎక్కి.. దిగడం అందరికీ సాధ్యం కావడం లేదనే వాదన  ఉంది. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నళ్ల ద్వారా.. ఫీలో ఉండే ట్రాఫిక్ సిబ్బంది ద్వారా కొంత సాయం దొరికినా పాదచారులకు అన్ని చోట్లా ఈ సౌకర్యాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై అలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై నడవాలన్నా.. క్రాస్ చేయాలన్నా ఎలా చేయాలనేదే పాదచారుల ప్రశ్న. గత డిసెంబర్ లో చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో రోడ్ క్రాస్ చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళను ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఆ ప్రమాదానికి కారణాలను విశ్లేషించగా అక్కడ రోడ్డు క్రాస్ చేయడానికి రిస్కు తీసుకోవడం తప్ప వేరే అవకాశం లేదని తెలిసింది. ఒకవేళ జీబ్రా సింగ్.. లేదా చౌరస్తాకు వెళ్లాలంటే కనీసం అరకిలోమీటర్ కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ప్రమాదకర చాలామంది రోడ్డు దాటే ధైర్యం చేస్తున్నారు. చాలాచోట్ల ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు దాటాలంటే ఓ సమస్య కాగా.. రోడ్డుపై నడవాలన్నా మరో సమస్య. ఫుట్ పాత్ లను దర్జాగా ఆక్రమించుకున్న వివిధ వ్యాపార వర్గాలు పాదచారులకు దారులు లేకుండా చేస్తున్నారు. రోడ్డు మీద పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లిళ్లాలన్నా అక్రమ పార్కింగ్లు, ఆటోల తిష్టతో జనం బేజారవుతున్నారు. వాహనదారుల కోసం తరచూ డివైడర్స్ ఏర్పాటు చేసి.. యూటర్న్ నిడివి పెంచడం.. అవసరమైతే వన్ వే ట్రాఫిస్టుగా మార్చే అధికారులు పాదచారుల గురించి కూడా ఆలోచించి వారికి నడిచే వీలు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించి చర్యలు తీసుకోవాలి. గతేడాది హైదరాబాద్ ట్రాఫిక్ అధికారులు గుర్తించిన ప్రమాదాల గణాంకాల్లో పాదచారులకు సంబంధించి 842ప్రమాదాలు జరగ్గా... 101 మంది మృత్యువాత పడ్డారు. 1769మందికి తీవ్ర గాయాలయ్యాయి. జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణ, 1769మందికి తీవ్ర గాయాలయ్యాయి. జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణ, పాదచారుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. వారికి సహకరించడానికి, బెటర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అమలు చేయడానికి అవసరమైన  ప్రణాళికలు సిద్ధం చేసేందుకు డబ్ల్యూ.ఆర్.ఐ స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగింది. పాదచారుల రక్షణ, వాహనదారులు ఇష్టారాజ్యంగా వెళ్లకుండా జంక్షన్ల రీ  డిజైనింగ్ కు శ్రీకారం చుట్టారు. రెండు వారాలుగా డబ్ల్యూఆర్ట్స్ అధికారులు చైతన్య, తరుణ్ లు పోలీసుల సహకారంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ జంక్షన్లలో భౌగోళిక స్వరూపాన్ని మార్చే పనులు ప్రారంభించారు. కూడలిలో మలుపుల వద్ద ఉన్న ఖాళీ స్థలాలను పాదచారులకు అనుగుణంగా వినియోగంలోకి తెస్తున్నారు.వాహనదారులు వేగంగా వెళ్లడంతోపాటు.. సిగ్నల్ పడినప్పుడు కూడా ఇష్టారాజ్యంగా వాహనాలు నిలుపుతున్నారు. దీంతో పాదచారులు రోడ్డు దాటడం కష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమాదాలూ జరిగి పాదచారులు మృత్యువాత పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పాదచారులు సురక్షితంగా రహదారి దాటేలా, వాహనదారులు క్రమ పద్దతిలో రాకపోకలు సాగించేలా జంక్షన్ల వద్ద ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ జంక్షన్లలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిగణనలోకి తీసుకొని డబ్ల్యుఆర్‌ కొత్త రీడిజైన్లు రూపొందిస్తుంది. ఇప్పటికే ఆ సంస్థ వారు ఢిల్లీ, ముంబాయి, బెంగళూరులో రీడిజైనింగ్ చేశారు. మంచి ఫలితాలు రావడంతో అక్కడి అధికారులు దాన్ని అమలు చేస్తున్నారు.